ఏలూరు జిల్లాలో పల్లె నిద్ర కార్యక్రమం.. ఎస్పీ  కె ప్రతాప్ శివ కిషోర్  ఆదేశాలతో..


 

ANDHRAPRADESH,ELURU:చింతలపూడి ఇన్స్పెక్టర్ శ్రీ క్రాంతి కుమార్ ధర్మాజీ గూడెం ఎస్ఐ వెంకన్న  వారి యొక్క సిబ్బంది తో కలిసి లింగపాలెం మండలం సుందరరావు పేట గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం ను నిర్వహించినారు.

ఏలూరు జిల్లా ఎస్పీ  కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్  జంగారెడ్డిగూడెం డీఎస్పీ  యు. రవిచంద్ర ఆదేశాల పై చింతలపూడి ఇన్స్పెక్టర్  క్రాంతి కుమార్ మరియు ధర్మాజీగూడెం ఎస్ఐ శ్రీ వెంకన్న  తమ సిబ్బందితో కలిసి అక్టోబర్ 7,8 తేదీలలో లింగపాలెం మండలం సుందరరావు పేట గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ తో పాటు పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు  పాల్గొన్నారు. చింతలపూడి ఇన్స్పెక్టర్  గ్రామ ప్రజలతో గ్రామములో ఉన్న సమస్య పై  ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. చట్టాలపై అవగాహన కల్పించడం, ప్రజల్లో చైతన్యం పెంపొందించడం లక్ష్యంగా వివిధ అంశాలపై వివరించారు.మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు (POCSO, IPC 354 మొదలైన సెక్షన్లు),సైబర్ నేరాల నుండి రక్షణ డ్రగ్స్ మరియు మద్యం దుర్వినియోగం పై ప్రభుత్వ చర్యలు,ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం గురించి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని దాని వలన ఏదైనా ప్రమాదం జరిగినయెడల ప్రాణానికి రక్షణ కలగజేస్తుందని, బాలల హక్కులు మరియు బాల్యవివాహాల నివారణల పై చక్కని అవగాహన తెలియజేస్తూ,పచ్చని పల్లె సీమలలో ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు కలగజేసే ఆసాంఘిక కార్యకలాపాలు కోడిపందాలు, పేకాట మరియు నాటు సారా తయారీ మరియు విక్రయాలు నివారణ కొరకు పోలీస్ సిబ్బంది మారుమూల ప్రాంతాలలో కూడా డ్రోన్ కెమెరా ద్వారా నిఘా చేస్తూ అసాంఘిక కార్యకలాపాల నివారణ కొరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని,ప్రజల భాగస్వామ్యంతోనే సమాజం శాంతియుతంగా, నేర రహితంగా ముందుకు సాగగలదని పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం మా ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు.

రాబోయే దీపావళి పండుగ సందర్భంగా, బాణసంచా అక్రమ తయారీ, నిల్వ లేదా విక్రయాలు జరిపే వారి వివరాలను డయల్ 112 లేదా ఏరియా ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ 9440796674కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.గ్రామస్తులు ఈ పల్లె నిద్ర కార్యక్రమములో  పాల్గొని, పోలీసు అధికారులను వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు.

ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చట్టాలపై అవగాహన పెరిగి, పోలీసు శాఖపై విశ్వాసం మరింత బలపడుతుందని చింతలపూడి ఇన్స్పెక్టర్  క్రాంతి కుమార్  తెలియ చేసినారు.