INTERNATIONAL, IRAN:ఇరాన్‌లో వైద్య విద్యఇరాన్ యుద్ధ భూమి నుంచి.. ప్రాణాలతో బయటపడ్డ 70 మంది కాశ్మీరీ విద్యార్థులు కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు గత నెల అకస్మాత్తుగా మొదలైన ఇజ్రాయెల్- అమెరికా దాడుల కారణంగా యుద్ధంలో చిక్కుకున్నారు. యుద్ధం రోజు రోజుకూ తీవ్రతరం కావడంతో వారంతా భయాందోళనలకు గురవుతున్నారు. ఇరాన్ గగనతలం మూసివేయడంతో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఏం చేయాలో? ఎలా అక్కడ నుంచి బయటపడాలో తెలియని పరిస్థితిలో వారు ఉన్నారు. వీరిని స్వదేశానికి తరలించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
ప్రస్తుతం ఇజ్రాయెల్- అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు, యుద్ధభూమిలో చిక్కుకున్నవారిని సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయ విద్యార్థుల భద్రతపై దృష్టిసారించిన ఇండియన్ ఎంబసీ ఇప్పటికే టెహ్రాన్‌లో ఉన్నవాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇరాన్ సరిహద్దు దాటి, అర్మేనియా వంటి దేశాల మీదుగా స్వదేశానికి చేరుకోవాలనుకునే భారతీయులకు కీలక సూచనలు చేసింది. ఎంబసీకి ముందస్తుగాసమాచారం ఇవ్వకుండా లేదా సమన్వయం చేసుకోకుండా సరిహద్దుకు చేరుకోవడం లేదా దాటే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దని విజ్ఞప్తి చేసింది.
ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయ సమాజ సభ్యులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా రాయబార కార్యాలయం పేర్కొంది. ప్రయాణ సంబంధిత లేదా ఇతర విషయాలలో సహాయం అవసరమయ్యే భారతీయ పౌరులకు అండగా నిలిచేందుకు, అవసరమైన ప్రతిచోట సమన్వయంతో కూడిన ఏర్పాట్లు జరుగుతున్నాయి... ఇరాన్‌లో ఉన్న తమ పౌరులు, రాయబార కార్యాలయంతో అధికారిక సంప్రదింపు మార్గాల ద్వారా అనుసంధానమై ఉండాలి.. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.. దీనివల్ల ప్రయాణసమయంలో పాటించాల్సిన విధానాలు తదితర అంశాలకు సంబంధించి, కచ్చితమైన సమాచారాన్ని.. తగిన మార్గదర్శకత్వాన్ని పొందగలుగుతారు’’ భారత రాయబార కార్యాలయం అధికారులు సూచించారు.
మాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సరిహద్దుల వైపు వెళ్లొద్దు... ఎంబసీ సహకారం లేకుండా బోర్డర్ దాటి ఇరాన్‌ను వీడేందుకు ప్రయత్నిస్తే.. రవాణా, ఇమిగ్రేషన్ విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.. ఒక్కసారి ఇరాన్ దాటిన తర్వాత సాయం కూడా చేయలేని పరిస్థితి నెలకుంటుంది... కాబట్టి ఇరాన్‌లోని భారతీయులు కచ్చితంగా మా సలహాలను పాటించాలి’’ అని రాయబార కార్యాలయం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్.. ఇరాన్‌లో చిక్కుకుపోయిన 70 మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. ముఖ్యంగా మృత్యువు నీడలో బతికిన వారందరినీ.. ఆర్మేనియా, దుబాయ్ మీదుగా సాహసోపేత ప్రయాణం చేయిస్తూ ఆదివారం క్షేమంగా ఢిల్లీ గడ్డపై దింపింది. విమానాశ్రయంలో దిగగానే విద్యార్థులు తమ మాతృ భూమికి ముద్దిడుతూ.. భావోద్వేగంతో తల్లిదండ్రులను హత్తుకున్నారు. వీరి ముఖాలు, వారి కళ్లల్లో భయం చూస్తేనే.. యుద్ధం ఎంత భయంకరంగా సాగుతుందో అర్థం అవుతోంది.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి చేర్చే బృహత్తర ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. యుద్ధ సంక్షోభం కారణంగా ప్రాణభయంతో అల్లాడుతున్న సుమారు 70 మందికి పైగా భారతీయ విద్యార్థులను ఆదివారం రోజు క్షేమంగా స్వదేశానికిచేర్చింది. మొదటి బ్యాచ్‌లో భాగంగా మొత్తంగా 70 మందిని.. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో క్షేమంగా న్యూఢిల్లీకి తరలించింది.

Social Plugin