![]() |
ANDRAPRADESH, AMARAVATHI: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ విలేజ్ క్లినిక్‌లకు సొంత భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. 4472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుకు రూ.1129 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో అధిక భాగం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయానికి తెరతీసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లను నిర్మించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. రూ.1129 కోట్లతో ఈ విలేజ్ క్లినిక్‌లకు సొంతంగా భవనాలను నిర్ణయించాలని.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదిలోగా విలేజ్ క్లినిక్‌లను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు.
ఏపీ వ్యాప్తంగా 4,472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రూ.1,129 కోట్లతో సొంత భవనాలను నిర్మించ తలపెట్టింది. ఏడాది వ్యవధిలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల్లో ఏర్పాటు చేసే విలేజ్ క్లినిక్‌ల నిర్మాణ పనులకు అయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 80 శాతం ఖర్చు చేస్తుందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా మరో 1,379 కొత్త భవనాలను నిర్మించాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఇందుకోసం రూ.753 కోట్లు అవసరం అవుతాయని పేర్కొన్నారు. అయితే ఈ నిధులను 16 వ ఆర్థిక సంఘం నుంచి తీసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఈ విలేజ్ క్లినిక్‌లలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 284 భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 200 కంటే ఎక్కువ విలేజ్ క్లినిక్‌లకు కొత్త భవనాలను నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు.
Social Plugin