ANDHRAPRADESH, BHIMAVARAM:ఐక్య నేషనల్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ పాఠశాలలో చదివే విద్యార్థులకు నైతిక విలువ నేర్పించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సింగల్ యూస్ ప్లాస్టిక్ నందు అవగాహన కార్యక్రమంలో భాగంగా "ఫిల్ ధ బాటిల్ విత్ ప్లాస్టిక్ వేస్ట్ "అనే స్లోగన్ తో మన ఇంట్లోకి వచ్చే ప్లాస్టిక్ వ్యర్ధాలను మనం వాడి పడవేసే ప్లాస్టిక్ బాటిల్ లో నింపి బయటపడవేసే విధానాన్ని విద్యార్థుకు నేర్పిస్తూ వారికి బహుమతులు ఇచ్చే కార్యక్రమం పాఠశాలలలో విద్యార్థులకు నిర్వహిస్తుంది. సామాజిక బాధ్యతలో భాగంగా ఉగాది నుంచి వాకింగ్ ట్రాక్స్ దగ్గర అవగాహన కల్పిస్తూ ప్రజలకు చేతి సంచులు అందజేస్తున్నారు.
అలాగే ఐక్య నేషనల్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్లాస్టిక్ వ్యర్ధాల వలన కలిగే దుష్ప్రయోజనాలను వివరిస్తూ నిర్మించిన "నీకోసం " షార్ట్ ఫిలింను తిలకించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కె రఘురామకృష్ణంరాజు ప్రజలకు మంచి అవగాహన కల్పించిన షార్ట్ ఫిలిం బృందాన్ని ఐక్య నేషనల్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థను అభినందించారు.
" నీకోసం " షార్ట్ ఫిలిం లోని సారాంశం ప్లాస్టిక్ కవర్లను విచ్చలవిడిగా ఉపయోగిస్తూ నిర్లక్ష్యంగా ఉండే ఒక తండ్రి. ఉపాధ్యాయుడి ప్రేరణతో తండ్రిని మార్చడానికి ప్రయత్నం చేస్తూ తమ స్కూల్లో జరగబోయే ప్లాస్టిక్ అవేర్నెస్ కాంపిటీషన్ కి సిద్ధమవుతున్న అతని కూతురు. ఈ ప్రయత్నాల మధ్య ఆమె ప్రమాదానికి గురవుతుంది. ఆసుపత్రిలో ప్లాస్టిక్ సంబంధిత వ్యాధి బయటపడుతుంది.ఈ సంఘటన తండ్రిని కుదిపేస్తుంది, అతని మనసులో మార్పు వస్తుంది.కూతురి కలను నెరవేర్చుతూ ,తను తీసుకువచ్చిన ప్రైజ్ ను చూసి, నాకు నిజమైన ప్రైజ్ నువ్వు మారడమే నాన్న ఆనందంతో ఈ కథ ముగిస్తుంది.
ప్లాస్టిక్ పట్ల ఏమాత్రం బాధ్యతలేని ఒక నిర్లక్ష్యపు వ్యక్తికి, ఆ ప్రకృతి ఎలా గుణపాఠం చెప్పింది అన్నదే కథాంశం. ఈ షార్ట్ ఫిలింకు బి.బాలాజీ దర్శకత్వం వహించగా వై శ్రీనివాస ఆచారి రూపొందించారు.
ఈ కార్యక్రమంలోఐక్య నేషనల్ ఫౌండేషన్, అధ్యక్షులు శివరామరాజు , వైయస్ ఆచారి వ్యవస్థాపక అధ్యక్షులు , కార్యవర్గ సభ్యులు, బి బాలాజీ, అప్పారావు, కీరు వై కృష్ణ, చిరంజీవి మృదుల, మరియు మీకోసం షార్ట్ ఫిలిం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ షార్ట్ ఫిలిం ఈ క్రింది లింకు టచ్ చేయటం ద్వారా నీకోసం షార్ట్ ఫిలిం చూడవచ్చును.
Social Plugin