![]() |
ANDRAPRADESH,CHINTALAPUDI:విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా బషీర్బాగ్ పోరాట స్ఫూర్తితో పోరాడాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయం నందు విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినం సిపిఐ మండల కార్యదర్శి తొర్లపాటి బాబు అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా వామపక్ష నాయకులు ఈ ప్రతిజ్ఞను చేశారు.
విద్యుత్ ఉద్యమ అమరవీరులారా ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఆదేశిత ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంలో ప్రజల కోసం తృణప్రాయంగా ప్రాణాలపించిన మీకు విప్లవ జోహార్లు నీ త్యాగాలను వృధా కానివ్వబోమని మీరు చూపిన సమరసిల బాటలో రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్న మోదీ ఆదాని అనుకూల విద్యుత్ సంస్కరణలు పెంచిన విద్యుత్ చార్జీలు ట్రూవాప్ చార్జీలు స్మార్ట్ మీటర్లు తదితర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామని వాము పక్ష నాయకులు ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ పి పాండురంగారావు ఆర్వీఎస్ సత్యనారాయణ డి సత్యనారాయణ సిపిఐ మండల కార్యదర్శి తొర్లపాటి బాబు మండల కమిటీ సభ్యులు కంచర్ల గురవయ్య సహాయ కార్యదర్శి దంతా కృష్ణ తో ర్లపాటి రాజు తాడిగడప మాణిక్యాలరావు మోర్తా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు
Social Plugin