Air India రు 1499 లకే ఫ్లైట్ టికెట్స్.. ఎయిర్ ఇండియా స్పెషల్ ఆఫర్.. ఇంకా ఒక్కరోజే ఛాన్స్..


 


AIR INDIA : మీరు ఈ దీపావళికి ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా, లేదా ఈ దీపావళి నుంచి వచ్చే వేసవి వరకు ఎప్పుడైనా ఏదైనా ప్రదేశాన్ని సందర్శించాలి అనుకుంటున్నారా అయితే మీరు బస్ టికెట్ ధరతోనే విమానంలో ప్రయాణం చేయవచ్చు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ తెచ్చింది కేవలం 1499 రూపాయలకే విమాన ప్రయాణం కల్పిస్తుంది ఈ 14అక్టోబర్ 2025 లోపు టికెట్ బుక్ చేసుకుని ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు మరి ఈ స్పెషల్ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం అంటే టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణానికి దూరంగా ఉండిపోతారు. కొందరు ఒక్కసారైనా విమానం ఎక్కాలనే కోరికతో ఉంటారు. అలాంటి వారందరికీ అదిరే శుభవార్త. కేవలం బస్ టికెట్ ధరతోనే విమానం ఎక్కవచ్చు. దేశీయ మార్గాల్లో కేవలం రూ.1499కే ఫ్లైట్ టికెట్స్ పొందే డీల్ అందుబాటులో ఉంది. దేశీయ దిగ్గజ విమాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) స్పెషల్ లిమిటెడ్ టైమ్ ఆఫర్ తీసుకొచ్చింది. దేశీయ మార్గాల్లో స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఈ దీపావళి నుంచి మొదలు కొని వచ్చే వేసవి కాలం వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

టికెట్ బుకింగ్ వివరాలివే..

ఎయిరిండియా స్పెషల్ ఫేర్స్ ఎకనామి క్లాస్ ధర రూ.1499 నుంచి ప్రారంభమవుతోంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రయాణం చేయవచ్చు. ఇక ప్రీమియం ఎకనామి క్లాస్ అయితే రూ.2249 నుంచి టికెట్ ధరలు మొదలవుతున్నాయి. ఇక బిజినెస్ క్లాస్ అయితే రూ.9999 నుంచి టికెట్ ధరలు ఉన్నాయి. ఈ స్పెషల్ సేల్ అక్టోబర్ 12వ తేదీన మొదలైంది. అక్టోబర్ 14, 2025 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. అంటే మంగళవారం అర్ధరాత్రి వరకు టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. దీని ద్వారా 2026, మార్చి 31వ తేదీ వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని ఎయిరిండియా తెలిపింది. అంటే వచ్చే వేసవి వరకు మీరు ఏదైనా ప్రదేశాన్ని సందర్శించేందుకు చాలా తక్కువ ధరకే టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు.

అలాగే విమాన టికెట్లపై ఒక్కో ప్రయాణికుడు అదనపు డిస్కౌంట్ రూ.400 వరకు పొందవచ్చు. ఎయిరిండియా వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకుంటూ ప్రోమో కోడ్ FLYAI ఉపయోగిస్తే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (HDFC Credit card) ద్వారా ప్రోమో కోడ్ HDFCFLY ఉపయోగించి రూ.400 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇక మహరాజా క్లబ్ మెంబర్స్ అయితే జీకో కన్వీనియెన్స్ ఫీ పొందవచ్చు.

ఈ స్పెషల్ టైమ్ పీరియడ్ ఆఫర్ అనేది అక్టోబర్ 14వ తేదీ 23.59 గంట్ల వరకు అందుబాటులో ఉంటుంది. మార్చి 31, 2026 వరకు ప్రయాణం చేయవచ్చు. అయితే, ఇందులో కొన్ని తేదీల్లో ఆఫర్ వర్తించదు. అవి 2025 డిసెంబర్ 11 నుంచి 2026 జనవరి 11 వరకు, 2026 జనవరి 24 నుంచి జనవరి 27 వరకు, 2026 మార్చి 2 నుంచి మార్చి 6 వరకు ఆఫర్ ఉండదని గమనించాలి. ఎకనామీ, ప్రీమియం ఎకనామీ క్లాస్‌లో కనిష్ఠ టికెట్ ధరలు జమ్మూ- లేహ్ మధ్య లబిస్తున్నాయి. ఇక బిజినెస్ క్లాస్ తక్కువ ధరలు ముంబై- వడోదర మధ్య అందుబాటులో ఉంటాయి. ఇక ఈ ఆఫర్‌లో పరిమిత సంఖ్యలో సీట్లు ఉంటాయి. ముందుగా బుక్ చేసుకునే వారికి ప్రాధాన్యత ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. కేవలం ఎయిరిండియా విమానాల్లోనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. పూర్తి వివరాలకు ఎయిరిండియా అధికారిక వెబ్‌సైట్లోనే డొమెస్టిక్ ఫ్లైట్ ఆఫర్ విభాగంలో తెలుసుకోవచ్చు.