ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన శాసనసభ్యులు రోషన్ కుమార్

 


ANDRAPRADESH CHINTALAPUDI: చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ మంగళవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని తాడేపల్లి నివాసంలో కలిసి నియోజవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధి కి చేయూతనివ్వాలని కోరారు

నియోజకవర్గ రహదారుల అభివృద్ధితోపాటు, చింతలపూడి లో బస్ డిపో ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత గురించి, గ్రామీణ ప్రాంత ప్రజలకు సోలార్ విద్యుత్తు చేరువ చేయడం తదితర అంశాలను ముఖ్యమంత్రి కి వివరించినట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలియజేసారు.