ANDHRA PRADESH, ELURU: ఏలూరు జిల్లాలొ మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు,స్థానిక కలెక్టరేట్ నుండి శనివారం జిల్లాలొ మట్టి అక్రమ త్రవ్వకాలు,రవాణా నియంత్రణపై అధికారులతొ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు,ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిలాల్లో కాలువలు,చెరువు గట్లు,తదితరాల ప్రదేశాల నుండి అనుమతి లేకుండా మట్టిని అక్రమంగా తవ్వి,రవాణా చేయడం చట్టరీత్యా నేరమని,ఆలా చేసేవారిని ఉపేక్షించేదిలేదన్నారు.
అక్రమంగా మట్టి తవ్వకాలు కారణంగా కాలువలు,చెరువుల గట్లు బలహీనమవుతాయన్నారు,. జిల్లాలొ మట్టి అక్రమ తవ్వకాలు,రవాణా నియంత్రణకు ఇరిగేషన్,రెవిన్యూ,పోలీసు అధికారులతొ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి,గట్టి నిఘా పెట్టాలని,ఎవరైనా అనుమతి లేకుండా మట్టిని తవ్వి,రవాణా చేస్తే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయాలన్నారు, రైతులు వారి పొలాలలొ అవసరాలకుగాను సంబంధిత తహసీల్దార్ల వద్ద నుండి మే నెలాఖరులోగా అనుమతి తీసుకుని మట్టిని తరలించుకోవచ్చన్నారు,ఈ కార్యక్రమంలొ ఇరిగేషన్ శాఖ ఎస్ఈ దేవప్రకాష్, జిల్లాలోని తహసీల్దార్లు,ఇరిగేషన్,గనులు శాఖ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Social Plugin