ANDHRAPRADESH,AMRAVATI : తోతాపురి మామిడి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది 40798 మంది రైతులకు రూ. 185.02 కోట్లు జమ చేసింది ధరలు పతనం కావడంతో టన్నుకు రూ. 4 వేలు పెట్టుబడి సాయం ప్రకటించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం మంజూరు చేశాయి. ఈ సాయం తో రైతులకు భరోసా దక్కిందని చెప్పాలి... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మామిడి రైతులకు తీపికబురు చెప్పింది. తోతాపురి మామిడి విక్రయించిన 40,795 మంది రైతుల బ్యాంక్ అకౌంట్‌లలో డబ్బులు జమ చేసింది. ఏపీ ప్రభుత్వం రూ.185.02 కోట్లను జమ చేసినట్లు ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలకు అనుగుణంగా చెల్లింపులు చేశామన్నారు. ఈ ఏడాది మామిడి సీజన్‌లో తోతాపురి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడ్డారు. వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం టన్నుకు రూ.4 వేల పెట్టుబడి సాయం ప్రకటించింది. దీంతో తోతాపురి మామిడి రైతులు కొంత కాలంగా ఈ పెండింగ్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు.. మొత్తానికి ఈ డబ్బులు జమ కావడంతో వారంతా ఆనందంలో ఉన్నారు. ఇప్పటికే పలు దఫాల్లో తోతాపురి మామిడి రైతులకు డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేశారు.
తోతాపురి మామిడి ధర పడిపోవడంతో రైతులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుంది. కిలో మామిడికి రూ.4 అదనంగా ఇచ్చేలా రూ.260 కోట్లు కేటాయించి రైతులకు న్యాయం చేశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (Market Intervention Scheme) కింద కేంద్రం 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరించేలా నిబంధనలు సడలించాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు విజ్ఞప్తి చేయడంతో కేంద్రం స్పందించింది. తోతాపురి మామిడికి కూడా ఈ స్కీమ్ వర్తించేలా నిబంధనలు సడలించడంతో, కేంద్రం రూ.130 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భవిష్యత్తులో తోతాపురి మామిడి ధర పడిపోయినప్పుడు ఈ స్కీమ్ ద్వారా రైతులకు అండగా నిలవడానికి అవకాశం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ తోతాపురి మామిడి రైతులకు కేంద్రం కూడా సహకారం అందించింది. 2025–26 సీజన్‌కు గాను MIS (మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్) కింద ధరల లోపం చెల్లింపు (PDP)ను కేంద్రం ఆమోదించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేసే అవకాశం రైతులకు లభించింది. క్వింటాల్ మామిడికి రూ.1,490.73 చొప్పున మద్దతు ధర ఫైనల్ చేశారు. ఈ మొత్తంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 50 శాతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాయి. ఈ సహాయాన్ని అందించినందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రధాని నరేంద్ర మోదీకి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్య మామిడి ధరలు పడిపోయినప్పుడు రైతులను ఆదుకుంటుందని, వారికి న్యాయమైన ఆదాయాన్ని అందించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.

Social Plugin