చింతలపూడి విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

 





 ANDRAPRADESH, CHINTALAPUDI:చింతలపూడి మారుతీ నగర్ లో ఆటో షోరూం ను ప్రారంభించిన శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ షోరూం ను ప్రారంభించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి, ఎలక్ట్రానిక్ ఆటో ను ప్రారంభించి, ఆటో డ్రైవర్స్ కు యూనిఫామ్ పంపిణి చేశారు.

ఈ కార్యక్రమం లో మండల, పట్టణ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తదనంతరం చింతలపూడి లో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడారు.అటెండన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు రికార్డ్స్ అన్ని ఫర్ఫెక్ట్ గా ఉన్నాయా,సుమారు వారం రోజుల్లో ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి అవి ఎలాంటి కంప్లైంట్స్ అని తెలుసు కొన్నారు.

ఎప్పటికప్పుడు విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలని,ముఖ్యంగా వర్షాకాలంలో విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు వెంటనే తగు చర్యలు తీసుకుని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించినట్లు తెలిపారు.