ANDRAPRADESH, GUNTURU: ఈనెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలులో ఎల్బీజీ భవన్ లో కామ్రేడ్ కనకాచారి 20వ సంస్మరణ సభ జరుగును. దానికి సంబంధించిన కరపత్రాన్ని ఈరోజు ఉదయం 11 గంటలకు నరసరావుపేట బస్టాండ్ సెంటర్లో ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిడియం రాష్ట్ర నాయకులు వై. వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి జి. రామకృష్ణ, పికేఎస్ జిల్లా కమిటీ సభ్యులు కంబాల ఏడుకొండలు, బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ పిడిఎం నాయకులు కామ్రేడ్ కనకాచారి మహబూబ్నగర్ జిల్లాలో అత్యంత పేద కుటుంబంలో జన్మించి చిన్ననాటి నుండి కష్టాలు పడి చదువుకొని బడిపంతులుగా పిల్లలకు పాఠాలు చెప్పడమే కాక, ఉపాధ్యాయ సమస్యలపై, సమాజంలో ఉన్న దోపిడీ, కుల వివక్షత అసమానతలు, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న కరువు పై పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు.
ఆనాటి పాలకులు ప్రైవేటు అంతక ముఠా నయుం చేత కనకాచారిని 20 ఏళ్ల క్రితం హత్య చేయించారని ఆయన ఆశయ సాధన క్రమంలో ఈనెల 23వ తేదీన 20వ సంస్మరణ సభను ఒంగోలులో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
Social Plugin