పార్లమెంటు సమావేశాలలో ఏపీ ఎంపీల ప్రశ్నల వర్షం ఏ పార్టీ ఎన్నంటే.. ఆ ఎం పి నే టాప్...


 

INDIA, DILHI : హస్తినాపురంలో తెలుగువాణి బలంగా వినిపిస్తుంది వివిధ సమస్యలు,అంశాలపై మన ఎంపీలు పార్లమెంటు సమావేశాలలో గళమెత్తుతున్నారు. పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ సంస్థ నివేదిక ప్రకారం ప్రశ్నలు అడిగిన విషయంలో జాతీయ ఎంపీల సగటు కంటే ఏపీ ఎంపీల సగటు ఎక్కువ కావడం విశేషం ఏపీలోని పార్టీలలో టిడిపి ఎంపీలు ఎక్కువ ప్రశ్నలు సందించగా అందులో విజయనగరం ఎంపీ కలిశెట్టి అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఎంపీల జాబితాలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అగ్రస్థానంలో ఉన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో తెలుగువాణి బలంగా వినిపిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో మన ఎంపీలు వివిధ సమస్యలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. తమ గళం వినిపిస్తున్నారు. గత ఏడాది కాలంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మొత్తం 1576 ప్రశ్నలు లేవనెత్తారు. ఇందులో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు 1081 ప్రశ్నలు లేవనెత్తగా.. ఆ తర్వాతి స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైసీపీ తరుఫున ఆ పార్టీ ఎంపీలు 267 ప్రశ్నలు పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించారు. ఏపీలోని బీజేపీ ఎంపీలు 134, జనసేన పార్టీ ఎంపీలు 94 ప్రశ్నలు సంధించారు. ఏపీ ఎంపీలు సగటున 71.6 ప్రశ్నలు లేవనెత్తగా.. జాతీయ సగటు కంటే ఈ మొత్తం ఎక్కువ కావటం విశేషం. ఈ విషయంలో జాతీయ సగటు 46.8గా ఉంది.ప్రశ్నల సగటు పరంగా కూడా టీడీపీ తొలిస్థానంలో ఉంది.

 టీడీపీ ఎంపీలు 77.2 ప్రశ్నలు అడిగితే, బీజేపీ ఎంపీలు 67.0 , వైసీపీ 66.8, జనసేన 47.0 ప్రశ్నలు లేవనెత్తారు. పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు 217 పార్లమెంట్ చర్చల్లో పాల్గొన్నారని.. టీడీపీకి చెందిన 14 మంది ఎంపీలు 125 డిబేట్లలో పాల్గొనగా.. వైసీపీ నలుగురు ఎంపీలు 42 డిబేట్లలో, బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు 22 డిబేట్లలో పాల్గొన్నారని వెల్లడించింది. మరోవైపు పార్లమెంట్ సమావేశాలకు హాజరు విషయంలోనూ మన ఎంపీలు మెరుగ్గానే ఉన్నారు. ఏపీ ఎంపీల సగటు హాజరు శాతం 83.9గా ఉంది. ఈ విషయంలో జాతీయ సగటు 86.8గా ఉంది. బీజేపీ ఎంపీల హాజరు శాతం87.5గా ఉంటే.. టీడీపీ ఎంపీల హాజరు శాతం 86.2గా ఉంది. జనసేన 82.4 హాజరు శాతం, వైసీపీ ఎంపీల హాజరు శాతం 74.6గా ఉంది.కనబరిచిన ఎంపీల జాబితాను కూడా వెల్లడించింది

సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఒక పాయింట్, పాల్గొన్న ప్రతి డిబేట్‌కు మూడు పాయింట్లు, హాజరుకు 0.5 పాయింట్లు కేటాయించారు. ఈ లెక్కన టీడీపీ పార్లమెంటరీ నేత , నరసరావుపేట ఎంపి లావు కృష్ణ దేవరాయలు అగ్రస్థానంలో నిలిచారు, వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి రెండవ స్థానంలో, జనసేన ఎంపీ బాలశౌరి మూడవ స్థానంలో నిలిచారు. జీఎం హరీష్ బాలయోగి, కలిశెట్టి అప్పలనాయుడు, టి. కృష్ణప్రసాద్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మరోవైపు ఏడాది పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ ఎంపీలు 71.6 ప్రశ్నలు లేవనెత్తగా.. విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అత్యధికంగా ప్రశ్నలు సంధించారు. ఆయన ఒక్కరే పార్లమెంట్ సమావేశాల్లో 89 ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాతి స్థానంలో 84 ప్రశ్నలతో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ 82 ప్రశ్నలు, వైఎస్ అవినాష్ రెడ్డి 80 ప్రశ్నలు అడిగినట్లు పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ నివేదిక వెల్లడించింది.