ANDRAPRADESH, CHINTALAPUDI:చింతలపూడి పట్టణం ఆర్కే కన్వెన్షన్ హాల్లో జరిగిన చింతలపూడి పిఎసిఎస్ చైర్మన్ తిరుమెల్లి రామారావు మరియు సొసైటీ డైరక్టర్లు నందిపాం నాగేశ్వరావు, చిక్కాల శ్రీనివాస రావు ల ప్రమాణస్వీకారం నకు ముఖ్యఅతిథిగా హాజరైన శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్
ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ 20 సొసైటీల చైర్మన్లు హాజరయ్యారు,ముందుగా చైర్మన్ మాట్లాడటం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర అధికార పార్టీ ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు మాట్లాడుతూ... చైర్మన్ గా నియమితులైన అందరూ కూడా బాధ్యతగా పని చేయాలని ,రైతులకు అందుబాటులో ఉండాలని తెలియజేశారు.
శాసనసభ్యులు మాట్లాడుతూ పదవి వచ్చిన చైర్మన్లు డైరెక్టర్లు ఎంతో బాధ్యతగా పనిచేయాలని, రైతుకు కావలసిన ప్రతి ఒక్కటి కొరత లేకుండా పంపిణీ చేయాలని అలాగే ఎప్పటికప్పుడు సొసైటీ అభివృద్ధి విషయంలో ముందడుగు వేయాలని మరియు అనంతపురంలో జరుగుతున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ కార్యక్రమం జరుగుతున్న సమయంలో నేపాల్ లో ఉన్నటువంటి భారతీయులు తిరిగి స్వదేశానికి తీసుకురావడం లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చూపించిన చొరవ , కృషి ప్రశంసనీయమని ,అద్భుతం అని కొనియాడారు,
ఆ తర్వాత పదవి వచ్చినవారు జాగ్రత్తగా చేయాలని పదవి రానివారు అసహనానికి లోనవ్వకుండా ఓపికతో ఉండాలని మీ పని మీరు పార్టీకి నిస్వార్ధంగా పనిచేయాలని పార్టీ మీకు సరైన సమయంలో మంచి పదవితో మిమ్మల్ని గౌరవిస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి దాసరి చంద్ర శేషు, పట్టణ పార్టీ అధ్యక్షులు తాటి అప్పారావు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు చీదరాల మధుబాబు ,బిజెపి పట్టణ పార్టీ అధ్యక్షురాలు విజయ కుమారి ,బిజెపి మండల పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శ్రీనివాసరావు , పార్టీ సీనియర్ నాయకులు చిట్లూరి ధర్మరాజు , కొత్తపూడి శేషగిరిరావు, పొదిలి రాయప్ప, పిఎసిఎస్ చైర్మన్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Social Plugin