తాడిపత్రి యువతి అదరగొట్టింది విదేశాలలో భారీ స్కాలర్షిప్... ఏకంగా రూ.లక్షల్లో


ANDRAPRADESH,ANANTAPURAM: అనంతపురం జిల్లాకు చెందిన భాను రేఖ అగరగొట్టింది ఎమ్మెస్సీ అగ్రికల్చర్ చేయడానికి విదేశీ యూనివర్సిటీలో సీటు సంపాదించడమే కాకుండా భారీ స్కాలర్షిప్ కూడా గెలుసుకుంది చిన్నప్పటినుండి వ్యవసాయంపై మక్కువతో శాస్త్రవేత్త కావాలని లక్ష్యంతో కష్టపడింది చివరికి ఆమె ఈ ఘనత సాధించింది మరోవైపు తిరుపతి పద్మావతి యూనివర్సిటీ విద్యార్థిని చంద్రిక గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ గా ఎంపికైనది ఈ ఇద్దరమ్మాయిలు తమ ప్రతిభతో రాణిస్తున్నారు

ఏపీకి చెందిన విద్యార్థిని అదరగొట్టారు.. విదేశాల్లోని యూనివర్శిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్ సీటుతో పాటుగా భారీ స్కాలర్‌షిప్ కూడా సంపాదించారు. తండ్రి దగ్గర వ్యవసాయం గురించి తెలుసుకుని.. వ్యవసాయ శాస్త్రవేత్త కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా ఇప్పుడు తొలి అడుగు పడింది.. ఎంఎస్సీ అగ్రికల్చర్ చదవడానికి విదేశాల్లో ఉచిత సీటు సంపాదించారు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన భానురేఖ వద్ది మోహన్, జ్యోత్స్న దంపతుల కుమార్తె భానురేఖ తాడిపత్రి అంబాభవానీ వీధిలో నివాసం ఉంటున్నారు. తండ్రి వ్యవసాయంతో పాటుగా దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. మోహన్ తన కుమార్తె భానును కష్టపడి చదివించారు. ఆమె తండ్రితో పాటూ పొలానికి వెళ్లేది.. ఈ క్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త కావాలని లక్ష్యం పెట్టుకున్నారు. టెన్త్. ఇంటర్‌ పరీక్షల్లో మంచి మార్కులతో రాణించారు. భాను తెలంగాణ ఎంసెట్‌లో ఏకంగా పదో ర్యాంకు సాధించారు. ఆమెకు బీఎస్సీ అగ్రికల్చర్‌ సీటు రాగా.. ఆమె బీఎస్సీని పూర్తి చేసింది. అంతేకాదు ఆమె ఆరు నెలలు పాటూ ఇక్రిసాట్‌లో ఇంటర్న్‌షిప్‌ కూడా పూర్త చేశారు.

అనంతరం ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివేందుకు జపాన్‌లోని మెక్స్‌ సంస్థ నిర్వహించిన పోటీ పరీక్ష కూడా రాశారు. భాను ఆ పరీక్షలో ప్రతిభ చాటడంతో స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. ఆమెకు జపాన్‌లోని హొక్కాయిడో యునివర్సీటీలో దాదాపు రూ.70 లక్షలు స్కాలర్‌షిప్ దక్కింది. ఆమె ఈ స్కాలర్‌షిప్‌తో ఉచితంగా సీటును సంపాదించారు. చిన్నతనం నుంచి తాను తండ్రితో కలిసి పొలం వెళ్లేదానని అంటున్నారు భానురేఖ. ఆయన కష్టాన్ని నేరుగా చూశానని.. పొలంలో పనులు, పంటలు ఎలా పండిస్తారో గమనించేదానని అన్నారు. తనకు జినోమిక్స్‌ అంశంలో పీహెచ్‌డీ పూర్తి చేయాలనే లక్ష్యం ఉందని.. శాస్త్రవేత్త కావాలని కోరిక ఉందన్నారు. ఒక సైటింస్ట్‌గా రైతలకు మేలు చేసేందుకు కొత్త వంగడాలను, ఆధునిక పద్ధతిలో వ్యవసాయం వంటివాటిపై పరిశోధన చేస్తానంటున్నారు.

తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీకి చెందిన బీటెక్ సీఎస్‌ఈ ఫైనలియర్ విద్యార్థిని కుంచెల చంద్రిక గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. గూగుల్ టెక్నాలజీపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినందుకు ఆమెను ఎంపిక చేశారు. వీసీ ఉమ ఆమెను అభినందించారు. చంద్రిక గూగుల్ టెక్నాలజీపై మంచి పట్టు సాధించారు.. ఆమె శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఆమెను గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్‌గా ఎంపిక చేశారు. ఏపీకి చెందిన యువతీ, యువకులు సత్తా చాటుతున్నారు. ఇటీవల ఇద్దరు యువకులు భారీ ప్యాకేజీలతో విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించారు. తాజాగా తాడిపత్రికి చెందిన విద్యార్థిని భానురేఖ, పద్మావతి వర్శిటీ విద్యార్థిని చంద్రికలు కూడా సత్తా చాటారు.