ANDRAPRADESH, ANAKAPALLI:అనకాపల్లి జిల్లాలో జనసేన నాకు షాక్ తగిలింది జనసేన పార్టీకి చెందిన నేత తిరిగి వైసీపీలోకి చేరిపోయారు. 2024 ఎన్నికలలో గెలుపొంది ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీ నుంచి పలువురు నేతలు కోటమీ పార్టీలో చేరిపోయారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మొదలుకొని ద్వితీయ స్థాయి నాయకత్వం సైతం చాలా చోట్ల వైసిపికి గుడ్ బై చెప్పింది ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా మునగపాక మండల ఎంపీపీ జయలక్ష్మి వైసీపీని వీడి జనసేన లో చేరారు. అయితే తాజాగా ఆమె మళ్ళీ తిరిగి వైసిపి గూటికి చేరారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సాధారణంగా విపక్షాల నుంచి అధికార పక్షాల్లోకి చేరికలు ఉంటాయి. ఎమ్మెల్యేలు మొదలుకొని.. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల వరకూ.. అధికార పార్టీ వైపు మొగ్గు చూపటం మామూలే. ఓ పార్టీ తరుఫున ఎన్నికల్లో గెలుపొంది.. ఆ తర్వాత అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వెళ్తున్నామని పార్టీ ఫిరాయించటం మామూలే. అయితే అధికార పార్టీలో నుంచి ప్రతిపక్షంలోకి చేరడం ఎప్పుడైనా చూశారా. అలాంటి ఘటనలు అప్పుడప్పుడూ అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలాంటి ఘటనే అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
అనకాపల్లి జిల్లా మునగపాకలో జనసేనకు షాక్ తగిలింది. మునగపాక ఎంపీపీ మల్ల జయలక్ష్మి జనసేనకు సర్‌ప్రైజ్ షాకిచ్చారు. మల్ల జయలక్ష్మి జనసేన పార్టీని వీడి తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. కరణం ధర్మశ్రీ, కన్నబాబురాజు సహా పలువురు నేతల సమక్షంలో జయలక్ష్మి వైసీపీ కండువా కప్పుకున్నారు. మల్ల జయలక్ష్మి వైసీపీ తరుఫున మునగపాక ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి రావటంతో.. జయలక్ష్మి జనసేన కండువా కప్పుకున్నారు. గతేడాది ఆగస్ట్ నెలలో వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు.
అయితే ఆ తర్వాత వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో జయలక్ష్మి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు.మరోవైపు అభివృద్ధి కోసమే అప్పట్లో జనసేన పార్టీలో చేరినట్లు జయలక్ష్మి చెప్పుకొచ్చారు. మునగపాక మండలాన్ని అభివృద్ధి చేస్తామని తనకు హామీ ఇచ్చారని.. కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోసం చేశారని జయలక్ష్మి జనసేన పార్టీపై ఆరోపణలు గుప్పించారు. జనసేనలో తనకు అవమానాలు ఎదురయ్యాయని.. అభివృద్ధి కోరుకునేవారికి జనసేన పార్టీలో గుర్తింపు ఉండదని జయలక్ష్మి ఆరోపించారు. పార్టీని వీడి జనసేనలో చేరినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జయలక్ష్మి క్షమాపణలు తెలియజేశారు. చేసిన తప్పును సరిదిద్దుకునేందుకే తిరిగి వైసీపీలో చేరారని జయలక్ష్మి స్పష్టం చేశారు.
Social Plugin