INDIA, ORISSA : ఒరిస్సా రాష్ట్రం ఘర్యాబంధు ఎన్కౌంటర్లో అమరులైన కామ్రేడ్ మోడం బాలకృష్ణ అలియాస్ మనోజ్ మరో 9 మంది అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పించారు ఈరోజు కేంద్ర కమిటీ సభ్యులు బాలకృష్ణ పార్థివదేహానికి సిపిఐ ఎంఎల్ రామచంద్రన్ పార్టీ రాష్ట్ర కమిటీ నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో సిపిఐ ఎం ఎల్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మధ్య భారత దేశంలో చత్తీస్గడ్ ఒరిస్సా జార్ఖండ్ రాష్ట్రాలలో ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులైన ఆదివాసీలను చిత్రహింసలు పెట్టుతూ కాల్చి చంపుతున్నారు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడానికి బిజెపి ప్రభుత్వం మధ్యభారతంలో జరుగుతున్నటువంటి హింసను ఆదివాసీలకు అండగా ఉంటున్న మావోస్తు పార్టీ నాయకులను కాల్చిచంపుతున్నారు ఈ అప్రజాస్వామిక విధానాలను వెంటనే ఆపివేయాలని సిపిఐ ఎంఎల్ రామచంద్రన్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ రామచంద్రన్ పార్టీ అధికార ప్రతినిధి ఎల్లుట్ల ఉపేందర్ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్లుట్ల మల్లేష్ పిడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు పూసపాటి సతీష్ పివైఎఫ్ జిల్లా కార్యదర్శి ఐత రాజు వెంకన్న రైతు కూలిసంఘం రాష్ట్ర నాయకులు కొమ్ము మల్లేష్ తదితరులు హాజరైనారు.
Social Plugin