ANDHRA PRADESH, AMRAVATI:ఏపీలో కొత్తగా మరో యూనివర్సిటీ ఏర్పాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మంత్రి నారా లోకేష్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామని ఇచ్చిన మాట ప్రకారం చిత్తూరు జిల్లాలో ప్రైవేటు లేదా ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు. మరోవైపు సెప్టెంబర్ 25వ తేదీన ఉపాధ్యాయుల నియామక పత్రాలు అందిస్తామని నారా లోకేష్ ప్రకటించారు అమరావతిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఏపీలోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని మహిళలకు స్త్రీ శక్తి పథకం పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 15వ తేదీ సాయంత్రం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. నాటి నుంచి ఉచిత బస్సు పథకం కింద మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఐదు రకాల బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. పల్లెవెలుగు. అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్నారు. మొదట ఘాట్ రోడ్లలో అనుమతించనప్పటికీ.. ప్రస్తుతం ఘాట్ రోడ్లలోనూ ఉచిత బస్సు పథకం అమలవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు చూపించి బస్సులలో ఉచితంగా ప్రయాణించే వీలుంది.
ద్రవిడియన్ యూనివర్సిటీ ప్రభుత్వం ఆధ్వర్యంలో.. అపోలో యూనివర్సిటీ ప్రైవేట్ కింద ఉన్నాయని వెల్లడించారు. అయితే సీఎం చంద్రబాబు మరో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని జిల్లా ప్రజలకు మాట ఇచ్చారన్న నారా లోకేష్.. ఆ మేరకు చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు ఆలోచన చేసి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
మరోవైపు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని రావికంపాడు హైస్కూలును జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలని తుని నియోజకవర్గం ఎమ్మెల్యే యనమల దివ్య విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. వైసీపీ హయాంలో జూనియర్ కాలేజీలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. తాము వాటిని పునరుద్ధరిస్తూ మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఏపీలోని జూనియర్ కాలేజీలలో అడ్మిషన్లు 40 శాతం పెరిగాయని నారా లోకేష్ వెల్లడించారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా మెటీరియల్ అందిస్తున్నామని వివరించారు. మరోవైపు భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజీ ఉండేలా చర్యలు చేపట్టినట్లు నారా లోకేష్ వివరించారు.
మరోవైపు విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం యూనిఫామ్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యూనిఫాంల తయారీని గతంలో చేనేత సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే వివిధ కారణాలతో ఇది సాధ్యం కాలేదని నారా లోకేష్ వెల్లడించారు. చేనేతల అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు.
మరోవైపు విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం యూనిఫామ్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యూనిఫాంల తయారీని గతంలో చేనేత సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే వివిధ కారణాలతో ఇది సాధ్యం కాలేదని నారా లోకేష్ వెల్లడించారు. చేనేతల అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు.
అలాగే చేనేతల కోసం మంగళగిరిలో వీవర్స్ శాల ఏర్పాటు చేశామన్న నారా లోకేష్.. కొత్త డిజైన్లు బ్రాండింగ్ మీద చర్యలు చేపడతామని వివరించారు. మరోవైపు సెప్టెంబర్ 25న అమరావతిలోని వెలగపూడి లో ఉపాధ్యాయ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేల అందరిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
Social Plugin