ANDRAPRADESH, CHINTALAPUDI:స్థానిక చింతలపూడి ప్రభుత్వా డిగ్రీ కళాశాలలో NCC యూనిట్ ఆధ్వర్యంలో 19వ ఆంధ్ర బెటాలియన్ ఏలూరు కమాండింగ్ అధికారి వారి ఆదేశాల ప్రకారం స్వచ్ఛ-హి-సేవా కార్యక్రమాన్ని 25.09.2025 న సామూహికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 మంది NCC విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ను, కళాశాల పరిసరాలను, చింతలపూడి ప్రధాన రహదారిని శుభ్రం చేశారు. ప్లే కార్డులు ప్రదర్శన ద్వారా గ్రామ ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యం కల్పించారు.
కళాశాల NCC లెఫ్టనెంట్ అధికారిని G.జీవన మౌనిక మాట్లాడుతూ అక్టోబర్ 2 న జరగబోయే స్వచ్ఛభారత్ దివాస్ వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి అక్టోబర్ రెండు వరకు ప్రతిరోజు భారత ప్రధాని సూచనలు మేరకు దేశవ్యాప్తంగా ఏక్ దిన్, ఏక్ గంటా, ఏక్ సాథ్ అనే నినాదంతో మన పరిసరాలను శుభ్రం చేసుకోవాలని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ Dr. P. శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మనందరి జీవితంలో దినచర్యగా మారాలని తద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందగలమని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో 20 మంది NCC స్టూడెంట్స్ , కళాశాల విద్యార్థులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
Social Plugin