ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ మరో శుభవార్త... ఎన్నో ఏళ్ల కల నెరవేరింది ఆదేశాలు జారీ

 



ANDRAPRADESH,AMARAVATHI:ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ లో 211 మందికి అధికారులకు పదోన్నతులు లభించాయి 53 మంది ఎంపీడీవోలకు డి ఎల్ డి వో లుగా 158 మంది డిప్యూటీ ఎం పి డి వో లుగా పదోన్నతులు పొందినారు ఎన్నికల తర్వాత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు ఏపీలో జర్నలిస్టుల ఆక్రిడేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్లు కల్పించారు. ఒకేసారి 211 మంది అధికారులకు పదోన్నతులు లభించాయి.. ఈ మేరకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. 53 మంది ఎంపీడీవోలకు డీఎల్‌డీవోలుగా ప్రమోషన్ వచ్చింది. మరో 158 మంది డిప్యూటీ ఎంపీడీవోలుగా, జిల్లా పరిషత్, డివిజనల్ పంచాయతీ కార్యాలయాల్లో పరిపాలనా అధికారులుగా పదోన్నతులు పొందారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ఆనందం నింపింది. ప్రమోషన్ల విషయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. ఏపీ పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు, ప్రమోషన్లు పొందిన ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమోషన్లు కల్పించడంలో కీలకంగా వ్యవహరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి కూడా ధన్యవాదాలు తెలిపారు. డిప్యూటీ సీఎం ఓఎస్డీ వెంకట కృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

 ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుమన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు. 53 మంది ఎంపీడీవోలకు డీఎల్‌డీవోలుగా పదోన్నతులు కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలకు, ఆకాంక్సలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర ఉన్నతాధికారులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు మేలు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.