MOVIE'S NEWS: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని సుకుమార్ పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించాడు. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో బన్ని ఇంటర్నేషనల్ రేంజుకు ఎదిగాడు. పుష్పరాజ్ హవాకు ఇప్పుడు ఎదురే లేదు. అయితే అల్లు అర్జున్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సుక్కూ తన కమిట్ మెంట్ ని ఫుల్ ఫిల్ చేయాల్సి ఉంది. గతంలో చరణ్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన గోదావరి నేపథ్య చిత్రం `రంగస్థలం` బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నటుడిగా రామ్ చరణ్ కి గొప్ప పేరు తెచ్చింది. అందుకే సుకుమార్ తదుపరి రంగస్థలం సీక్వెల్ పై దృష్టి సారించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పుష్ప 2 రిలీజైన తర్వాత సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఫ్రెష్ ఐడియా కోసం అతడు చాలా కాలంగా వర్క్ చేస్తున్నాడు. అదే సమయంలో `రంగస్థలం` సీక్వెల్ స్క్రిప్టును కూడా అతడి టీమ్ రెడీ చేస్తోందని కథనాలొస్తున్నాయి. విదేశాలలో ఫ్యామిలీ వెకేషన్ పూర్తి చేసుకున్న తర్వాత సుకుమార్ కొంత గ్యాప్ తీసుకుని తిరిగి స్క్రిప్టుపై దృష్టి సారించారని తెలిసింది. ఇటీవల స్క్రిప్ట్ పై పని జరుగుతోంది. బౌండ్ స్క్రిప్ట్ రెడీ కాగానే చరణ్ కి ఫైనల్ గా కథాంశాన్ని వినిపిస్తాడు.
దుబాయ్ లో స్క్రిప్టు పనులు చేసేందుకు సుకుమార్ ఎంతో ఆసక్తిగా ఉన్నారని.. తదుపరి అతడు దుబాయ్ వెళతారని కూడా టాక్ వినిపిస్తోంది. రంగస్థలం సీక్వెల్ కి సుకుమార్ స్వయంగా దర్శకత్వం వహిస్తారు. ప్రతిష్ఠాత్మక మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తుంది. పుష్ప 2 తర్వాత మైత్రిలో తెరకెక్కే అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రమిదని కూడా తెలుస్తోంది.
Social Plugin